ఏపిలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు విడతల పోలింగ్ ను పూర్తి చేసుకున్న ఈ ఎన్నికలు ఇప్పుడు మూడో విడత ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికలు కుడా ఒకేసారి ఉదయం 6.30 నుంచి మొదలైంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ను కూడా మొదలు పెట్టనున్నారు.