టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో ఫలితాలు తారు మారు అయిన కూడా బుద్ది రాదు. ఇప్పటికీ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. నిన్న మీడియా తో మాట్లాడుతూ.. కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వాయ్యం ఓడిపోయిందనడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందన్నారు. తమ నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే కుప్పంలో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుప్పంలో ఎక్కడ రిగ్గింగ్ జరిగిందో బాబే చెప్పాలన్నారు. కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన మరీ రీకౌంటింగ్ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.