పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి' అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల పోలీసు అధికారులకు అభినందనలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఈసీ అభినందించిన విషయాన్ని తెలిపి క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఇప్పటి వరకూ పోలీసులకు కొవిడ్ సోకినట్లు దాఖలాలు లేవని, అవసరమైతే వ్యాక్సినేషన్‌కు సిద్ధమన్నారు.. పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కలిగించేలా చేయాలని ఆదేశించారు..