దేశంలో నేడు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 27 నుంచి ఈ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడు లో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.