పోలీసులు వివిధ అంశాల్లో దేశానికి ఆదర్శంగా ఏపి పోలీస్ నిలిచారు. టెక్నాలజీని ఉపయోగించి అన్నీ అన్నిటిలోనూ కొత్త రికార్డును సృష్టించారు.డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్' ప్రకటించిన అవార్డుల్లో తన సత్తా చాటింది.. అయితే జాతీయ స్థాయిలో అవార్డులను ప్రకటించగా అందులో నాలుగు సొంతం చేసుకుంది.ఏపీ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్, 4ఎస్4యు యూట్యూబ్ చానెల్‌కు ఈ నాలుగు అవార్డులు దక్కాయి. వెబినార్ ద్వారా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులను అందుకున్నారు..