పోలీసులు న్యాయం వైపు ఉండాలని ఆ భాధ్యత డీజీపి మీద ఉందని ఆయనకు సూచించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాల్లో తెదేపా సానుభూతిపరులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీ సర్పంచిగా గెలిచిన వైకాపా మద్దతుదారు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెదేపా మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారంటూ డీజీపీకి శనివారం ఆయన లేఖ రాశారు. పసిపాప ఆ శబ్దాలకు భయపెడుతుందన్న విషయానికి టీడీపీ నేత ఇంటి సభ్యుల పై దాడికి పాల్పడటం అమానుషం.ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నా' అని లేఖలో పేర్కొన్నారు..