కడప రాజకీయాల రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ , బీజేపి లు నువ్వా నేనా అన్న విధంగా రెచ్చిపోతున్నాయి. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఏపి సీఎం ఇలాకాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల పై బీజేపి నేత సోము వీర్రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి చెక్‌పెట్టే ఏకైక పార్టీ భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప విచ్చేసిన ఆయన.. నగరంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు