హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఓ ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు అది కాదంటూ హితబోధ చేశారు. సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులను కొట్టడం, దౌర్జన్యం చేయడాన్ని ఎవరూ సమర్థించుకోలేరని అన్నారు. రాత్రి మందు కొట్టడం.. పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధిగా ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి సాక్షాత్తూ ఎమ్మెల్యేతో దెబ్బలు తినాల్సిన ఆగత్యం ఓటర్లకు ఏర్పడిందని ద్వజమెత్తారు.