నేటితో ఏపిలో మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఈ గడువు ముగియనుంది. ఎల్లుండి అంటే పదో తేదీన దాదాపు 75 మున్సిపాల్టీలు 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కడపలో టీడీపీ నేతలు ప్రచారంలో జోరు పెంచినట్లు తెలుస్తోంది. ప్రచారానికి అవకాశమున్న చివరిరోజు అవడంతో ఎక్కువ వార్డులను చుట్టేసేందుకు వివిధ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తాము వెళ్లలేకపోయిన వార్డుల్లో మైకులతో కూడిన ప్రచార వాహనాలను ఎక్కువగా తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు.