గతం తో పోలిస్తే ఈ ఏడాది ఓటింగ్ శాతాన్ని పెంచేలా చూడాలని అధికారులను కోరారు..ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లలో విశ్వాసం కలిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం ఆయన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉల్లంఘనలపై, ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరా పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆ అధికారులను, ఎస్ఈసీ అప్రమత్తం చేశారు. కోడ్ ఉల్లంఘనల విషయంపై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది..