పంచాయితీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికల పై పడిందన్న విషయం తెలిసిందే..ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల మాట అటుంచితే, కనీసం పరువైన మిగులుతుందా అనే ఆలోచనలో పడ్డారు. నేటితో ప్రచారం కూడా ముగియనుంది.అయితే ఈ మేరకు టీడీపీ, జనసేన తో బంధం కలుపుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.జనసేన పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. స్థానికంగా అవకాశం ఉన్న ప్రతి చోటా ఆ పార్టీతో కలిసి పనిచేస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడం, కొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడంతో జనసేనతో అక్రమ బంధానికి రెడీ అయ్యింది.