చిత్తూరులో ఓటుకు రూ.వెయ్యి వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో రూ.వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే రోజా నియోజక వర్గం నగిరిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా నేతలు తగ్గట్లేదు.. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రచారం ముగిసిన కూడా ఇలా చాటు మాటుగా పంపిణీ కానిస్తున్నారు.. ప్రజలు కూడా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటు అన్నట్లు మారిపోయారు. రేపు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలు కానుంది..