ఎలుకలు ఏం ఉంచినా కొట్టేస్తాయి.. కానీ మద్యాన్ని కూడా వదలట్లేదు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త కని విని ఎరుగని వార్త అనే చెప్పాలి. ఒక సీసా రెండు సీసాలు కాదు ఏకంగా 30 వేల లీటర్ల మద్యాన్ని స్వాహా చేసాయట.. ఇది నిజంగా నమ్మలేని వార్త అనే చెప్పాలి.అక్రమ మద్యం రవాణాను పోలీసులు దేశ వ్యాప్తంగా అరికడుతున్నారు. అలా దొరికిన మద్యాన్ని కొన్ని గొడాన్ లో ఉంచుతారు. అయితే, ఇప్పుడు అదే మద్యాన్ని ఎలుకలు తాగాయని అంటున్నారు.