కొంతమంది వార్డు వాలంటీర్లు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన విషయం తిరుపతి నగర పాలక సంస్థ 50వ డివిజన్లో వెలుగులోకి వచ్చింది. 50వ డివిజన్లో తెదేపా అభ్యర్థి కాయం వెంకటరత్నం, వైకాపా అభ్యర్థి అనిల్, స్వతంత్ర అభ్యర్థి ధనశేఖర్ మధ్య పోటీ జరుగుతోంది. మంగళవారం సుమారు 20 మంది మహిళా వాలంటీర్లు సాధారణ దుస్తులు ధరించి, ఎవరికీ అనుమానం రాకుండా చేతిలో ఓటరు చీటీలు పెట్టుకుని ఓటర్ల తరహాలో డివిజన్ పరిధిలోని కాలనీల్లో తిరిగారని, ప్రతి ఇంటికీ వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు స్థానికులు మండిపడ్డారు.