కడప జిల్లా లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అందరూ కడప నియోజక వర్గాల్లో వైసీపీ హవా కొనసాగుతోందని భావిస్తున్నారు. జిల్లాలోని రాయచోటి మొదటి నుంచి కాస్త టెన్షన్ ను పెట్టిస్తుంది.పురపాలక సంఘంలోని బుధవారం జరగనున్న ఎన్నికలకు అధికారులు ఒకరోజు ముందే ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని 25వ వార్డుకు సంబంధించిన ఓటర్లకు డైట్లోని ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలు, 24వ వార్డు ఓటర్లకు బస్టాండు సమీపంలోని ఇరిగేషన్ కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు, 23వ వార్డు ఓటర్లకు బోస్నగర్లోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు కేంద్రాలలో పోలింగ్ నిర్వహిస్తున్నామని సహాయ ఎన్నికల అధికారి ఆర్.రాంబాబు పేర్కొన్నారు.