చిత్తూరు మదనపల్లె ఎన్నికలు కీలకంగా మారాయి. పురపోరులో మహిళల పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే ఓటర్లుగా వారే ఎక్కువగా ఉన్నారు. ఛైర్పర్సన్లుగా చాలాచోట్ల ఎన్నికకానున్నారు. పలమనేరు పురపాలక సంఘంలో వరుసగా మహిళలే ఛైర్పర్సన్లుగా ఎన్నికవుతుండగా.. మదనపల్లెలో తొలిసారిగా మహిళకు రిజర్వు అయ్యింది.ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పట్టణంలో 35 వార్డులుంటే 18 మహిళలకు రిజర్వేషన్ అయ్యాయి. 15 వార్డులు ఏకగ్రీవం కాగా అందులో 9 మంది మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవమయ్యారు..మొదటిసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఇచ్చిన నేపథ్యంలో గట్టి పోటీ నెలకొంది.