రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పురపాలక ఎన్నికలు జరిగాయి..గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల తో పోలిస్తే ఈ ఎన్నికలు ఇంకాస్త ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ ఐదు గంటల పై నమోదయ్యింది. కాగా, కొన్ని జిల్లాల్లో పోలింగ్ రసాభాసగా జరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల మద్య జరిగింది. అంతేకాదు దొంగ ఓట్లు వేయించడానికి కూడా కొందరు నేతలు వెనకాడలేదు.చిత్తూరు , విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు దొంగ ఓట్లకోసం కొందరు వ్యక్తులను రంగంలోకి దించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.