నిన్న చిత్తూరు జరిగిన ఘటన రాజకీయ చర్చలకు దారి తీసింది.. పోలీసులు వర్సెస్ పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. శ్రీకాళహస్తి లో ఈ ఘటన వెలుగు చూసింది..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భద్రత కల్పించేందుకు వచ్చిన భద్రతా ఉద్యోగులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏటా మహాశివరాత్రికి ముందురోజున ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు బుధవారం పట్టువస్త్రాలను తీసుకువచ్చారు.