ఓ రైతుకు సంబందించిన కొబ్బరి , ఎర్ర చందనం తోటను వైకాపా నేతలు కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లన్నింటినీ ఆరేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఫలం చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతి చేశారు. 80 శాతం చెట్లు కాలిపోయాయి. దాదాపు రూ.40 లక్షల నష్టం వాటిల్లింది. దీని వెనక వైకాపా నాయకుల హస్తం ఉంది' అని కర్నూలు జిల్లాకు చెందిన రైతు, తెదేపా మాజీ కౌన్సిలర్ వాపోయారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఆదోని మండలం ఢణాపురం సమీపంలోని రంగన్న పొలంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.