తమిళనాడులోని కరూరు నాగపంపల్లిలోని ఓ పెట్రోలు బంకు యజమాని తమ దగ్గరకు వచ్చే కస్టమర్లకు లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తున్నాడు.అయితే చిన్న షరతు మీదే. అదేంటంటే, ఆ బంకుకు వచ్చే కస్టమర్ల పిల్లలు కనీసం పది నుంచి ఇరవై పద్యాలు చెప్పాలి. మన దగ్గర వేమన శతకంలా తమిళంలోనూ తిరువళ్లువర్ రాసిన తిరుక్కురల్ పద్యాలుంటాయి. రెండు పాదాల్లో ఉండే ఆ పద్యాల్లో ఎన్నో జీవిత సత్యాలుంటాయనీ, వాటిని పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పద్యాలు చెప్పిన వారికి పెట్రోలు ఉచితంగా ఇస్తున్నాననీ చెబుతున్నాడు ఆ బంకు యజమాని సెంగుట్టువన్. ఆయన స్థానికంగా ఉండే వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సెన్స్ అండ్ మానేజ్మెంట్కు ఛైర్మన్ కూడా.