యూపీలోని మొరదాబాద్ జిల్లాలో 14 ఏండ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాలిక కుటుంబం బరేలిలోని సివిల్లైన్స్లో ఫుడ్ స్టాల్ నడుపుతుండగా నిందితుడు అక్కడికి తరచూ వస్తుండేవాడు. బాలికపై కన్నేసిన నిందితుడు మార్చి ఏడున బాధితురాలు సరుకులు కొనేందుకు మార్కెట్కు రాగా అపహరించి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై కిడ్నాప్, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు...