ఏపి లోని కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ ను విధించే దిశగా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.. ఏపీలో ఒక గ్రామంలో లాక్ డౌన్ విధించారు అధికారులు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో కరోనా మహమ్మారి రెండోసారి విస్తరిస్తున్న కారణంగా ప్రభుత్వ స్కూళ్లను రెండు రోజులపాటు మూసివేసి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ గ్రామంలో పది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో గ్రామంలో రెవెన్యూ, పోలీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పర్యటించారు. అనంతరం మండల తాసిల్దార్ మాట్లాడుతూ మండలం మొత్తం పదకొండు కరోనా కేసులు నమోదైతే అందులో కమ్మపల్లి పంచాయతీలోనే 10, గంగిరెడ్డిపల్లి పంచాయతీ లో ఒక కేసు నమోదైందని వైద్యులు వెల్లడించారు.