ఏపిలో మొన్నటివరకు ఎన్నికలు వేడి వాతావరణాన్ని సృష్టించాయి. పంచాయితీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పట్టుబట్టి మరీ ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా ఎన్నికల తంతును పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది..మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నా కూడా ఆయన పక్కకు వెళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.