నిరుద్యోగుల భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చిందన్నారు.. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం వారికి కొన్ని నెలల జీతాలు ఇవ్వలేకుండా పోయిందని సీఎం వ్యాఖ్యానించారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఈ విషయం పై ఆందోళన చెందవద్దని కేసీఆర్ అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకుంటుదని హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు మొండి చెయ్యి చూపించడం బాధాకరమని సదరు అభిప్రాయపడుతున్నారు..