బంగారం, విదేశీ కరెన్సీని విగ్గుల్లో పెట్టి, అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5.5 కేజీల బంగారాన్ని, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.53 కోట్లు అని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. రామనాథ పురానికి చెందిన మగ్రూబ్ అక్బరాలీ , చెన్నైకి చెందిన హసన్ రఫియుద్దీన్ ల హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చింది. వారిని ఎగ్జిట్ గేట్ వద్ద ప్రశ్నించారు. పాక్షికంగా గుండు చేయించుకుని, విగ్గులు ధరించినట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసలు మర్మరం తెలిసింది.