స్టెల్త్ ప్యూరో ఎయిర్'. ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారిని ఉద్దేశించి ఈ ఫ్యాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అన్ని ఫ్యాన్లలా ఇది గాలిని నలువైపులకు పంపించడమే కాకుండా అదే సమయంలో శుద్ధి చేస్తుంది. ఇందులో హెచ్ఈపీఏ ఫిల్టర్‌ను కూడా అమర్చారు. దాంతో ఈ ఫ్యాన్ గాలిని శుద్ది చేసి ఇస్తుంది. ఈ ఫ్యాన్ కార్బన్ ను యాక్టివేట్ చేస్తుంది. ప్రీఫిల్టర్ విష పదార్థాలను గ్రహించి స్వచ్చమైన గాలిని విడుదల చేస్తుంది. ఇలా ఫ్యాన్ గాలిని ముందుగా శుద్ది చేసి అందిస్తుంది.