నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్‌లకు సోమవారం నోటీసులు జారీచేసింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన తన కుమార్తెను ప్రేమికుడు బ్లాక్మెయిల్ చేసి నగ్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడని, తమ ఫిర్యాదు ఆధారంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ నుంచి ఆ ఫొటోలను తొలిగించారని బాధితురాలు తెలిపింది. తన కూతురుకు ఇప్పుడు 32 ఏండ్లని, భర్త,కుమారుడితో ఆస్ట్రేలియాలో స్థిరపడి సంతోషంగా ఉన్నదని, ఆ నేపథ్యంలో ఆ ఫొటోలు 2019లో మళ్లీ కనిపించాయని, వీటిని తొలిగించాలని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని, పైగా ఫొటోలను తాము సోషల్‌మీడియాలో పెట్టలేదని చెప్తున్నాయని బాధితురాలి తల్లి హైకోర్టును ఆశ్రయించారు.