టిడిపిని టార్గెట్ చేసిన బీజేపి అగ్రనేత టీడీపీ అధినేత నేత చంద్రబాబు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.చంద్రబాబు హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్నారని ఎద్దేవా చేశారు.తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సోమవీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజీ తీసుకున్నారని తెలిపారు. ఈరోజు అధికారం పోయాక వారి ఎంపీలు హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.