ఇసుక ధర ఇంత పెరుగుతుందని ఇప్పటి వరకు ఎవరు కలలో కూడా అనుకోలేదు. సొంత ఇల్లు నిర్మించుకుకోవాలన్న సామాన్య, మద్యతరగతి వర్గాలకు చెందిన కలలు నిజమయ్యే పరిస్థితి కనిపించడంలేదు.  ప్రభుత్వం ఇసుక రవాణపై నిషేధం విధించడంతో పాటు ఇసుక వ్యాపారంపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు ధర విపరీతంగా పెంచుతున్నారు. గతంలో టన్ను ఇసుక ధర 300నుండి 400 వరకు ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో టన్నుకు ధర వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది. అంటే ఈ లెక్కచొప్పున కిలో ఇసుక ధర రూపాయి పలుకుతుంది. ఇంటి నిర్మాణంలో 20శాతం ఖర్చు ఇసుకకు అవుతుంది. అంటే 4లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే 80 వేల రూపాయల వరకు ఇసుకకు అవుతుంది. కాగా పెరిగిన ఇసుక ధర ప్రకారం లక్షన్నర వరకు ఇసుకకే ఖర్చవుతుంది. సిమెంటు బస్తా ధర 290 రూపాయల నుండి 250 రూపాయల వరకు తగ్గిందని ఇల్లు నిర్మించుకునేవారు ఆనంద పడుతుండగా ఒక్కసారిగా ఇసుక ధర పెరుగడంతో వారి ఆశలు అడి ఆశలవుతున్నాయి.  ప్రభుత్వం మంజూరీ చేసిన ఇండ్లు సైతం ఇసుక ధర పెరుగడంతో మద్యలోనే నిలిచిపోతున్నాయి. ఇసుక ధర వ్యాపారులు విపరీతంగా పెంచండం, దీనిపై ఎటువంటి నియంత్రణ లేక పోవడంతో వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారింది. ఫలితంగా వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇసుక నిషేధం పేరుతో వ్యాపారులు లాభాలను ఆర్జిస్తుండగా వినియోగదారులకు భారంగా మారింది.  పెరిగిన ఇసుక ధర కారణంగా బిల్డర్లు సైతం ఎక్కువ ధరలకు వారు నిర్మించిన ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో ఇసుక భారం ఫ్లాట్లను కొనుగోలు చేసే కాస్తంత ఎగువ మద్యతరగతి వారిపై కూడా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: