జర్నలిజం చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. 80 ఏళ్లుగా ప్రచురితమవుతున్న ప్రఖ్యాత 'న్యూస్ వీక్' మేగజైన్ ఆగిపోయింది. ప్రింట్ ఎడిషన్‌కు స్వస్తి చెప్పి ఆన్‌లైన్‌ ఎడిషన్ కు శ్రీకారం చుడుతోంది. న్యూస్‌వీక్ కార్యాలయం నలుపుతెలుపు ముఖచిత్రంతో విడుదల చేసిన ఆఖరు సంచికను వరల్డ్ వైడ్ గా పత్రికా పాఠకులు అపురూపంగా దాచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో చదివే వ్యూవర్స్ రోజురోజుకు పెరిగిపోతుండటంతో పలు పత్రికాసంస్థలు 'ట్యాబ్లెట్ స్ట్రాటజీ' పేరుతో ఆన్‌లైన్ ఎడిషన్లలో కూడా విడుదల చేస్తున్నాయి. కానీ, న్యూస్ వీక్ ఏకంగా ప్రింట్ ఎడిషన్‌ను ఆపేసి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యే నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: