పార్టీలోనే ఉంటూ పక్కలో భల్లెం మాదిరిగా తయారై, పార్టీ రహస్యాలను ఎప్పటికప్పుడు శత్రువులకు అందజేస్తూ పార్టీకి అన్యాయం చేసే వారిని కోవర్టులుగా పిలుస్తారు. ఈ పదం విప్లవ పార్టీలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. కాగా కోవర్టులు రాజకీయ పార్టీల్లో ఉన్నారనే విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 20సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకున్న నాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టు పార్టీ కోవర్టులతోనే నష్టపోయింది. శత్రువులకు తెలియకుండా తమకార్యక్రమాలను నడిపిన నక్సలైట్లు తాము ఎక్కడుంటున్నామో, ఎక్కడ తింటున్నామోననే విషయాలు చివరకు కేవలం కోవర్టులతోనే బహిర్గతమయ్యాయి. దళాల్లో ఉంటూనే దళం కదలికలను శత్రువులకు చేరవేయడంతో చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. దీంతో పార్టీ కోవర్టులతోనే ఎక్కువగా నష్టపోయింది. ఎంతో మంది మావోయిస్టు అగ్రనాయకులు కోవర్టు ఆపరేషన్లతో చనిపోగా పార్టీ నష్టపోయింది. సమాచార వ్యవస్థ నామమాత్రంగానే ఉన్నటువంటి సందర్భంలో కోవర్టులు ఎవరో తెల్సిపోయిన సందర్భంలో పెరిగి పోయిన సమాచార వ్యవస్థలో కోవర్టులను కనుగోనడం అంతగా కష్టమేమికాదు. కాగా సాయుద విప్లవ పార్టీలను అంతమొందించడం కోసం కోవర్టుల పదం ఎక్కువగా వాడుకలోకి రాగా ప్రస్థుతం అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం కోవర్టులున్నారని అదే పార్టీవారు ఆరోపిస్తున్నారు. అంతే కాదు వారి సంఖ్యను లెక్కకట్టి మరి చెబుతున్నారు. వారు ఎవరో కాదని హోదాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని, వారంత వైఎస్ఆర్ పార్టీకి కోవర్టులని అంత గట్టిగా చెబుతున్నాడంటే కొంత వాస్తవం ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపించిన వ్యక్తి మామూలు నాయకుడు కాదు గతంలో రాష్ట్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిలో కొనసాగిన నేత. అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని అంత గట్టిగా వాదిస్తున్నాడంటే ఇటువంటి సమాచార వ్యవస్థలో ఆదారాలు తెల్సుకొని మాట్లాడుతుండవచ్చననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ ఆదారాలు చూపించక పోతే వాటిని బ్లాక్ మేయిల్ రాజకీయాలుగా చూడడంతో పాటు ఆరోపించిన నాయకులను సైతం అదే విధంగా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: