నటి శ్రీదేవి శనివారం రాత్రి అనూహ్యంగా గుండెపోటుతో చనిపోయారు. ఇదీ ఇప్పటి వరకూ దేశానికి తెలిసిన వార్త. దీనిపై అనేక అనుమానాలున్నాయి. అసలు ఆమెకు గుండెపోటు రావడం ఏంటి.. అప్పటి వరకూ ఆమె పెళ్లి వేడుకలో హుషారుగా పాల్గొన్నారని వీడియోలు కూడా టీవీలు చూపుతున్నాయి. ఆమె చివరి ఫోటోలు అంటూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

దుబాయ్‌లో నిబంధనలు కఠినం
కానీ ఇంతలోనే ఏమైంది. అందులోనూ ఆమె కుటుంబానికి గుండెపోటు చరిత్ర కూడా లేదు. గతంలోనూ ఎన్నడూ ఆమెకు గుండెపోటు రాలేదు కూడా. అయితే ఇప్పుడు ఆమె చనిపోయింది గుండెపోటుతో కాదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 ఈ తరహా బ్రేకింగ్ న్యూస్ తో కలకలం రేపింది. 

శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్
ఇంతవరకూ పోస్టు మార్టం రిపోర్ట్ కానీ.. ఎలాంటి నివేదిక కానీ ఆమెకు గుండెపోటు అని ధ్రువీకరించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే నిజమైతే శ్రీదేవి ఎలా చనిపోయారు. గుండెపోటు రాకపోతే ఏం జరిగి ఉంటుందనే అనుమానాలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. దీనికితోడు శ్రీదేవి చనిపోయి దాదాపు 36 గంటలు దాటుతున్నా మరణంపై ఎలాంటి ప్రకటన కూడా వెలువడకపోవడం కూడా సందేహాలు పెంచుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: