మనిషి ఎగ్జిట్ ఎలా ఉంటుంది అన్నది అతను అనుసరించే విధానాలను బట్టి ఉంటుంది. అందులో సందేహంఅవసరం లేదు. మనిషి అతను చేసే పనులు ఎలా ఉంటాయి. అతని జీవితం ఎలా సాగుతుంది.. ఏం చేయబోతున్నారు అనే విషయాలు అతనిపై ఆధారపడి ఉంటాయి. కొందరి ఎగ్జిట్ అద్భుతంగా ఉంటుంది. మరికొందరు కుక్కచావు చేస్తుంటారు. తమకు బలం ఉందని, బలగం ఉందని విర్రవీగిన ఎందరో నాయకులు అలానే మరణించారు. ఉదాహరణకు ఒసామా బీన్ లాడెన్,
లిబియా నియంత,
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ కూడా అలానే మరణించాడు.
ఎంత దారుణంగా మరణించాడో చెప్పక్కర్లేదు. ఆయన్ను పట్టుకోవడానికి అమెరికా
ప్లాన్ చేసింది. అయితే, బాగ్దాదీ ఎక్కడ ఉండేవాడో ఎవరికి తెలిసేది కాదు. ఎక్కడ ఎలా ఉండేవాడో ఎలా ప్రయాణం చేసేవాడో చాలా వరకు సస్పెన్స్ గా ఉండేది. కానీ, చివరకు ఆయన్ను పట్టుకున్నారు. ఓసారి, కూరగాయల మార్కెట్ కు బాగ్దాదీ అనుచరుడు కూరగాయల మార్కెట్ కు వచ్చాడు.
అలా మార్కెట్ కు వచ్చిన బాగ్దాదీ అనుచరుడిని అనుసరించిన ఓ వ్యక్తి అతను ఓ ఇంట్లోకి వెళ్లడం గమనించాడు. ఆ ఇంట్లోనే బాగ్దాదీ ఉన్నాడని నిర్ణయం తీసుకొని ఆ సమాచారాన్ని ఇరాక్ సైన్యానికి అందించాడు. ఇరాక్ సైన్యం అమెరికాకు సమాచారం ఇచ్చింది. దీంతో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుపెట్టడానికి
ప్లాన్ చేసింది. మొత్తం 90 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేయాలి. దానికి తగ్గట్టుగా అన్ని సిద్ధం చేసుకుంది. ముందుగా అమెరికా సైన్యం అతని అనుచరుల ఇంటిని చుట్టుముట్టునది. ఆ సమయంలో అతను కాల్పులు జరపడంతో.. అమెరికా సైన్యం అతనిపై కాల్పులు జరిపి మట్టుపెట్టాయి. ఆ సమయంలో ఇద్దర్ని సజీవంగా పట్టుకున్నారు.
అనంతరం అమెరికా సైన్యం బాగ్దాదీ ఇంటిని చుట్టుముట్టింది. ఈలోగా బాగ్దాదీ తన
భార్య పిల్లల్తో కలిసి ఓ కలుగులోకి వెళ్లి దాక్కున్నాడు. అలా కలుగులోకి వెళ్లి దాక్కోవడంతో.. ఆ కలుగులోకి అమెరికన్ సైన్యం కుక్కల్ని వదిలింది. ఆ కుక్కలు అతడిని వెంటాడాయి. కలుగులో చివర వరకు వెళ్లిన ఆ తరువాత బయటకు వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో.. చేసేది లేక బాగ్దాదీ తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ పేలుడులో అమెరికన్ కుక్కలకు గాయాలయ్యాయి.