ప్రస్తుతం మామూలు ఫుడ్ తినడం కంటే బర్గర్లు తినటానికి  ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు.ప్రస్తుత రోజుల్లో బర్గర్లు పీజ్జాలు తినటం అదో ట్రెండ్ గా మారిపోయింది . ఇక ఈ బర్గర్లు పిజ్జాల గోల మార్చేలా అయితే పాశ్చాత్య దేశాల్లో మరి ఎక్కువగా  ఉంటుంది. ప్రజలు బతికేది బర్గర్లు పిజ్జాలు తినె . దీంతో  వాళ్లకి బర్గర్లు తినటం అంటే  అది రోజువారీ ఆహారంలో ఒక భాగం . దీంతో బర్గర్లను  తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు పాశ్చాత్య దేశాల దేశాల ప్రజలు. అయితే తాజాగా బర్గర్  ప్రియుల కోసం ఓ రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్  ప్రకటించింది . అది ఏంటో తెలుసా 9 నిమిషాలల్లో  బర్కత్ తినేస్తే 25 వేల రూపాయలు బహుమతిగా ఇస్తారు. హ అదెంత  పని చిటికలో చేసేస్తామంటారా. కానీ మీరు తినడానికి ఇచ్చే బర్గర్ ను చూస్తే మీ  నిర్ణయం మార్చుకుంటారు. 

 

 

 

 ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ అనుకుంటున్నారా... థాయిలాండ్ లో . పర్యాటకులకు స్వర్గధామంగా ఉండే థాయిలాండ్ లో  సుందరమైన దీపాలు ముఖ్యంగా థాయిలాండ్ నైట్ లైఫ్ ప్రపంచదేశాలను అధికంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే థాయ్ ల్యాండ్  రాజధాని బ్యాంకాక్ నగరంలో క్రిస్ స్టీక్స్  అండ్ బర్గర్స్  అనే  రెస్టారెంట్ ఓ తిండి  పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఓ బర్గర్ ను  9 నిమిషాలలో మొత్తం తినేయాలి. అలా తిన్న  వారికి 25వేల రూపాయల బహుమానం అందిస్తుంది ఈ రెస్టారెంట్.అయితే ఇక్కోడో మెలిక ఉంది.  ఈ రెస్టారెంట్లో బర్గర్  అలాంటిది ఇలాంటివి కాదండోయ్ దీని బరువు ఏకంగా 6 కిలోలు ఉంటది. థాయిలాండ్ లో తయారు చేసే బర్గర్స్  అన్నింటిలోనూ ఇదే పెద్దది . 

 

 

 

 మరి ఇలాంటి ఆరు కిలోల బర్గర్ ను  తొమ్మిది నిమిషాల్లో తినడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకే క్రీస్ స్టీక్స్ అండ్ బర్గర్స్  రెస్టారెంట్ వారు ఎవరు తినరు అనే ధీమాతోనే ఇలాంటి పోటీ పెట్టారు. అయినప్పటికీ చాలామంది ఈ బర్గర్  తినేసి 25000 గెలుచుకుందామని ముందుకొచ్చారు కూడా. కాగా ఈ బర్గర్ తినటానికి వచ్చిన వారికీ  దీన్ని తినడానికి 15 నిమిషాల వరకు టైం తీసుకున్నారట.దీంతో  రెస్టారెంట్ ప్రకటించిన ప్రైస్ మని ఎవరు కలవలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: