పీకల్దాకా పీపా లేపేసింది. ఒంటిమీద తెలివి లేకుండా పడిపోయింది. అయ్యో పాపం అని ఆడ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంతే వెనకాముందూ చూడకుండా రెచ్చిపోయింది. ఇంతకీ మందు కొట్టిందా? డ్రగ్స్‌ తీసుకుందా? అన్నయాంగిల్లో ఎంక్వయిరీ చేస్తున్నారు. 


మద్యం తాగితే మనిషికి మృగానికి తేడా ఉండదంటారు. అది నిజమేనని నిరూపించిందో మందుమతి. మద్యం మత్తులో ఉన్న తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేసింది.. మహిళ కదా అని ఊరుకుంటే... వీరంగం వేసింది మహిళా ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లపై దాడి చేసింది. 


బంజారాహిల్స్‌ లోని జహీరానగర్‌ ప్రాంతంలో లీసా అనే మహిళ మద్యం మత్తులో రోడ్డు పక్కన పడిపోవడంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాసేపటి తర్వాత మత్తు నుంచి తేరుకున్న ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో పట్టుకునేందుకు ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ప్రయత్నించారు. అంతే...  బండబూతులు తిడుతూ వారిపై చెయ్యి చేసుకుంది.  ఓ కానిస్టేబుల్ చేతిని కొరగ్గా, మరో కానిస్టేబుల్ మెడపై గోళ్లతో రక్కేసింది. చివరికి ఆమెను అతి కష్టం మీద పట్టుకుని కూర్చోబెట్టారు. ఇంతకీ ఈమె ఎవరని ఆరా తీస్తే... నాగాలాండ్ వాసి అని తేలింది.  మాదాపూర్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్న లీసా... డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. మొత్తం మీద  మహిళ మత్తులో పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. 


మొత్తానికి నాగాలాండ్ వాసి హైదరాబాద్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. తాగినమైకంలో ఎవరా అని చూడలేదు. రక్షణ భటులకు చెమటలు పట్టించింది. ఆమె మానం కాపాడదామని మహిళా పోలీసులు కనికరిస్తే విధ్వంసం సృష్టించింది. ఓ పదినిమిషాలు పోలీస్ స్టేషన్ లో అసలు ఏమౌతుందో అర్థం కాలేదు. లేడీ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి యత్నించిన ఆమెను ఎట్టకేలకు పట్టుకోవడంతో సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: