జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ లోని పల్లెటూళ్లలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్నాయి. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో గ్రామీణ ప్రభుత్వ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మరిన్ని సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

మన బడి నాడు-నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధి నిధులతో ప్రహారీ గోడల నిర్మాణాలకు రూ.601 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.3,335 కోట్ల ఉపాధి నిధులు కేటాయించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఇప్పటి వరకు రూ.896 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.

 

అంతే కాదు.. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉపాధి హామీ పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్‌ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని సూచించారు.

 

25 లక్షల పక్కా గృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఇలాంటి వరుస సంచలన నిర్ణయాలతో గ్రామసీమల రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: