హోటళ్లలో పార్సిల్  కోసం ఎక్కువగా పాత వార్తాపత్రికలను వాడతారని విషయం తెలిసిందే. ఎలాంటి పార్సెల్ చేయాలన్న ఎక్కువగా వార్తాపత్రికలను వాడుతూ ఉంటారు. వార్తాపత్రికల్లో పార్సిల్ చేసిన ఆహారాన్ని  హోటల్ నుండి ఇంటికి తీసుకు వెళ్తూ ఉంటారు చాలా మంది జనాలు. గత కొంతకాలంగా ప్లాస్టిక్ నిషేధం అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడ ఏ హోటల్ లో ఏ షాపులో ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్లాస్టిక్ కవర్లను వాడితే భారీగా జరిమానా విధిస్తామని అంటూ హెచ్చరించింది ప్రభుత్వం. దీంతో చాలామంది హోటళ్లలో షాపులలో ప్లాస్టిక్ కవర్ల కు బదులు న్యూస్ పేపర్లను వాడుతున్నారు. 

 

 ఇక ప్లాస్టిక్ నిషేధం నిబంధన వచ్చినప్పటినుంచి ఈ వార్త పేపర్ ల వాడకం మరింత పెరిగిపోయింది. హోటళ్లలో ఆహార పదార్థాలను వార్తా పేపర్ల లో పార్సిల్  చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు చాలామంది. ఇక అటు  హోటల్ సిబ్బంది కూడా ఆహారాన్ని పార్సిల్ చేయడానికి ఎక్కువగా వార్తాపత్రికలను వాడుతుంటారు. అయితే ఇలా వార్తాపత్రికల్లో పార్సిల్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆహార భద్రత అధికారులు చెబుతున్నారు. వార్తా పత్రికలో ఆహారాన్ని తీసుకెళ్లడాని మానుకోకపోతే ఇక ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

 


 వివరాల్లోకి వెళితే... ఆహార పదార్థాలను ఇంటికి పార్సల్ చేసి ఇవ్వాలి అంటే చాలా హోటల్ వార్తాపత్రికలను వాడుతుంటారు. వార్తాపత్రికల్లో ఆహారాన్ని పార్సిల్ చేసి దానికి ఒక కవర్ పెట్టి ఇస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని భారత ఆహారభద్రత ప్రమాణాల సంస్థ అధికారులు సూచించారు. వార్తాపత్రిక పై ఉండే అక్షరాల సిరాలో శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉంటాయని ఆహార భద్రత  అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వార్తాపత్రికలు ఆహారపదార్థాలను తీసుకెళ్తే... సదరు వినియోగదారునికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆహార భద్రత  సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వార్తా పత్రికల్లో పార్సెల్ చేసిన ఆహారాన్ని తింటే మనిషి బాడీలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని... వార్త పేపర్ పై ఉండే అక్షరాల సిరా రసాయనాలు  జీర్ణప్రక్రియ పై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: