2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ  ఎక్కడ నిరాశ చెందకుండా ప్రతిపక్ష టిడిపి పార్టీ కంటే ఎక్కువగా ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు మరింత బలం చేకూరేలా బీజేపీతో కలిసి ముందుకు నడిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు ఏర్పడి కొన్ని రోజులు కూడా కాకముందే బిజెపి పార్టీ తో పొత్తు పై జనసేనాని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉండటం.. అంతేకాకుండా వైసిపి పార్టీ ఎన్డీయేతో  తో కలిసి నడుస్తుందని వార్తలు వస్తుండడంతో బీజేపీకి దూరంగానే ఉంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

 


 ఈ క్రమంలోనే బిజెపి జనసేన కలిసి నడుస్తామని చెప్పినప్పటికీ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే అమరావతిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుకు సంబంధించి ఆయన కాస్త అసంతృప్తిగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. తనతో పాటు ఎవరు వచ్చినా రాకున్నా తాను మాత్రం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు . కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో ప్రభుత్వం .. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీకి గుడ్బై చెబుతాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమరావతి లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

 


 బిజెపి వైసీపీ మధ్య పొత్తు కుదిరి పోయింది అంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధం అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్... ఒకవేళ బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని కాకపోతే అందులో నేను ఉండను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బిజెపి పొత్తు పెట్టుకుంటుంది అని నేను చెప్పడం లేదని...  పొత్తు పెట్టుకోదు అని నమ్మకం ఉంది కాబట్టి ఇంత స్పష్టంగా చెబుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మహనీయుల అడుగుజాడల్లో నడిచి... అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు అండగా ఉండటానికి రాజకీయాల్లోకి వచ్చానని... ఓట్లు వేయించుకొని ప్రజలని తొక్కేయాలని రాజకీయాల్లోకి రాలేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీకు అండగా ఉండి భరోసా ఇద్దామని రాజకీయాలకు వచ్చాను.. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది అని తెలిపారు. అమరావతిని రాజధానిగా మార్చేస్తాం అంటూ వాళ్ళు వీళ్ళు  చెప్పినప్పటికీ ఎక్కడికి వెళ్లినా రాజధానిని తిరిగి తీసుకొచ్చి అమరావతిలో పెడతాం  అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: