మాన్సాస్ ట్రస్టు వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తన అన్న కుమార్తె సంచయితకు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ పదవిని ఎపి ప్రభుత్వం ఇవ్వడంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం తీరు సరికాదని ఆయన అన్నారు. సింహాచలం ట్రస్టు పరిదిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని ఆయన చెప్పారు.

 

 

ఆ భూములపై కొందరు కన్నేశారని ఆయన ఆరోపించారు. సంచయిత ఆదార్ కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివిసిస్తున్నారో తెలుస్తుందని ఆయన అన్నారు.ప్రభుత్వ వైఖరి వల్ల భవిష్యత్తు తరాలకు నష్టం కలగవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తాను న్యాయ పోరాటం చేస్తానని అశోక్ గజపతి ప్రకటించారు.

 

 

మరోవైపు అశోక్ గజపతి ప్రకటనపై సంచయిత కూడా ఘటుగానే స్పందించారు. తాను ఒక లాయర్ అని, గూగుల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును గెలుచుకున్నానని మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత అన్నారు. తాను ఇక్కడ జరుగుతున్న విషయాలను సరిదిద్దుతానని ఆమె అన్నారు ఒక మహిళ శక్తి ఏమిటో తెలియచేస్తానని అన్నారు. తన తాత పివిజి రాజు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, ట్రస్టులో కొన్ని లోపాలు జరిగినట్లు సమాచారం వచ్చిందని ,వాటిని సరిచేస్తానని అన్నారు.

 

 

తాను పెద్ద వ్యక్తిని కాకపోవచ్చని, కాని పోరాటం చేయగలనని సంచయిత అన్నారు. తనవైపు నిజం ఉందని, స్వతంత్రంగా పనిచేస్తానని , తాను పనిచేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలని సంచయిత అన్నారు. అసెంబ్లీలో మహిళలకు ఎన్.టి.ఆర్.చట్టం తెచ్చారని, అప్పుడు తన తండ్రి కూడా అందులో భాగస్వామి అని అన్నారు. దాని ప్రకారం మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. అతిధి గజపతిరాజుకు అవకాశం ఇచ్చినప్పుడు తనకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తాను చర్చికి వెళ్లానని ప్రచారం చేస్తున్నారు.. కానీ అశోక్ గజపతి ఎప్పుడూ మసీదులకు, చర్చిలకు వెళ్లలేదా.. వెళ్తే అన్యమతస్తులు అయిపోతారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ తండ్రీ కూతుళ్ల పోరు ఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: