కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరకు లాక్ డౌన్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. నిరుపేదలకు పరిహారంగా నగదు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఫ్రీగా రేషన్ కూడా ఇస్తామంటున్నాయి. అయితే జనం మాత్రం సీరియస్ గా లేరు. జనతా కర్ఫ్యూ ఒక్క రోజు బాగానే ఇళ్లలో ఉన్న జనం మరుసటి రోజే వీధుల్లోకి పరుగులు పెట్టారు.

 

 

ఈ రద్దీ ప్రధానంగా మార్కెట్లపై పడింది. లాక్ డౌన్ మరికొన్ని రోజులు ఉంటుందన్న ఆలోచనతో జనం మార్కెట్లపై పడ్డారు. దీంతో సామాజిక దూరం సంగతి పక్కకు పెట్టారు. ప్రత్యేకించి రైతు బజార్ల వద్ద ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు పడి తోసుకున్నారు. ఇక ఇదే సీన్ రైతు బజార్లలో రోజూ కనిపించే ఛాన్సుంది. అందుకే ఏపీ మంత్రి కన్నబాబు ఓ ఐడియా వేశారు. అదేంటంటే.. రైతు బజార్లు అన్నింటినీ దగ్గర్లోని మైదానాలకు, స్కూలు గ్రౌండ్లకూ తరలించాలని నిర్ణయించారు.

 

 

ఇందుకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇలాంటి అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించారు. కేవలం రైతు బజార్లే కాదు.. బాగా రద్దీగా ఉండే అన్ని రకాల మార్కెట్లను సమీపంలోని మైదానాలకు తరలిస్తున్నారు. ఇందువల్ల షాపులు దూరం దూరంగా పెట్టే వీలుంటుంది. జనం కూడా కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు కరోనా సెకండ్ స్టేజ్ లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం చాలా మెచ్చుకోదగిందే.. ప్రజలు సాధ్యమైనంత వరకూ సామాజిక దూరం పాటిస్తే చాలు.. కరోనాను కాస్త కట్టడి చేయొచ్చు. లేకపోతే.. తెలుగు రాష్ట్రాలు ఇటలీని తలపిస్తాయి. ఏపీ మంత్రి ఆలోచన తెలంగాణ సర్కారు కూడా పరిశీలన చేయొచ్చు. మంచి ఐడియా ఎక్కడ నుంచైనా తీసుకోవచ్చు కదా. ఏమంటారు..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: