ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.  ఈ వైరస్ నివారణ కోసం అన్ని దేశాల్లో లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  రానున్న రెండు వారాల సమయం అమెరికన్లకు అత్యంత బాధాకరమైన రోజులను కళ్లముందుంచనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.  వందలాది ప్రాణాలు బలితీసుకుంటూ భీతావహ వాతావరణ సృష్టిస్తోంది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.

 

ఆ రాష్ట్రాలకు వెళ్లకూడదంటూ అధికార వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.  సుమారు 2.40 లక్షల మంది వరకూ  అమెరికన్లు చనిపోవచ్చని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది.  కాగా అమెరికాలో కరోనా సంఖ్య సోకిన వారి సంఖ్య 188172కు చేరింది. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

 

కరోనా మహమ్మారి ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తున్నదని అభివర్ణించిన ట్రంప్,  ముందు ముందు రానున్న కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి అమెరికన్ సిద్ధంగా ఉండాలి అని సూచించారు.  ఇక అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని... అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని శ్వేతసౌధ వర్గాలు హెచ్చరించాయి.  కరోనాను శరీరం నుంచి తొలిగించేందుకు ఏ మ్యాజిక్ వాక్సిన్ లేదా వైద్యం లేదు. కేవలం అలవాట్లను మార్చుకోవడం ద్వారా వైరస్ కు దూరం కావచ్చు అని వైట్ హౌస్ కరోనా వైరస్ రెస్పాన్సివ్ టీమ్ సమన్వయకర్త డెబోరాహ్ బిర్క్స్ వ్యాఖ్యానించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: