కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో పోలీసులు అన్ని చోట్ల పూర్తి అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రజలందరూ రోడ్ల పైకి రాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత పోలీసులకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాయి. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమించే అవకాశం ఉండడంతో పటిష్టంగా లాక్ డౌన్ నిబంధనలు కేంద్ర ప్రభత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా లో రోడ్ల పైకి వచ్చే వారిపై పోలీసులు లాఠీలతో సమాధానం చెబుతున్నారు. రోడ్లపై జనసంచారం పై పోలీసులు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల పోలీసులు ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ, వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం ఇష్టానుసారంగా ప్రజలను లాఠీలతో చితక బాదుతున్నారు. 

 

IHG

తాజాగా పోలీసులు ఇదే విధంగా వనపర్తి లో ఓ వ్యక్తిని విచక్షణారహితంగా రోడ్డుపైన కొట్టడం బాగా వైరల్ అయ్యింది. అది కూడా ఆ వ్యక్తి కుమారుడు ముందే పోలీసులు క్షణాలు రహితంగా కొట్టడం, ఆ పిల్లవాడు తన తండ్రిని ఏమీ చేయవద్దు అంటూ వేడుకోవడం ... మా డాడీ ని కొట్టవద్దు ..  వద్దు అంకుల్, వద్దు డాడీ వద్దు అంకుల్ అంటూ ఒకవైపు తండ్రిని మరోవైపు పోలీసులను అడ్డుకుంటూ వేడుకున్నా, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా తండ్రిని, కుర్రవాడిని పోలీస్ జీప్ లో  కుక్కి తీసుకెళ్లిన సంఘటన బాగా వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ దీని పై ఘాటుగా స్పందించారు.

 

 

 " ఇలాంటి పోలీసులు ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం, హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, తెలంగాణ డీజీపీలు దయచేసి ఇటువంటి సంఘటన పై కఠిన చర్యలు తీసుకోండి. కొద్ది మంది పోలీసుల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది"అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఆ సంఘటనను ప్రస్తావిస్తూ పోలీసుల తీరుపై అందరూ మండిపడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: