130 కోట్ల జనాభా ముక్కోటి దేవతల నమ్మకాలు ఎన్నెన్నో భాషలు సంస్కృతులు వాటన్నింటినీ కలగలిపే ఒకేఒక్క భావం భారతీయత. నవీన సాంకేతిక శిల్పి ప్రపంచ హైటెక్ దిగ్గజం 2015 సంవత్సరంలో ఒక భయానక వైరస్ ప్రపంచం మీద దాడి చేస్తే తట్టుకోగల శక్తి అమెరికాకు కూడ లేదు అని ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియచేసారు అంటే బిల్ గేట్స్ కోవీద్ – 19 ఉపద్రవాన్ని ముందుగానే ఊహించార అని సందేహాలు కలగడం సహజం. 


ఒక సూక్ష్మజీవి ఊహాన్ లో పుట్టి నేడు ప్రపంచం అంతా విస్తరించి ప్రపంచ జనాభాను అతలాకుతలం చేస్తుంటే వైజ్ఞానికంగా ఎంతో ఎదిగిన మనిషి సూక్ష్మజీవితో పోరాటం చేయలేక మనిషి అలిసి పోతున్నాడు. అయితే మనిషి అన్ని జీవాల కంటే గొప్ప కాబట్టి కంటికి కనిపించని శత్రువు అయిన ఆ సూక్ష్మజీవి పై మరింత రెట్టించిన పట్టుదలతో పోరాటం చేయడానికి నేడు ప్రధాన మంత్రి మోడీ పిలుపుతో ఈరోజు రాత్రి  9 గంటల నుండి 9 నిముషాలు విద్యుత్ దీపాలు ఆపి దీపాలు వెలిగించడానికి దేశ ప్రజానీకం సమాయుక్తం అవుతోంది. 


భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్ పాయ్ వ్రాసిన ‘రండి దీపాలు వెలిగిద్దాం’ కవితను ప్రధాన మోడీ మరొకసారి దేశ ప్రజలకు గుర్తు చేస్తూ ఒక వీడియో క్లిపింగ్ నిన్న షేర్ చేసారు. తనకు నియంత కసాయి పాలకుడు పండితుడు పామరుడు ఉన్నవాడు లేనివాడు బలవంతుడు బలహీనుడు కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్ అందరు ఒకటే అన్న సమభావనతో కరోనా ప్రపంచాన్ని జనాన్ని ఒకే మాదిరిగా చూస్తూ ఒకే విధంగా అందరి పై సమానంగా దాడి చేస్తోంది తన సామ్యవాదాన్ని చాటుకుంటోంది. 


మహాభారతం లో కూడ ‘మారి’ అనే పదాన్ని అంటువ్యాధి అనే అర్ధంలో మహాకవి తిక్కన తన విరాటపర్వంలో ఒక పద్యంలో ఉపయోగించిన తీరు పరిశీలిస్తే ఇలాంటి వైరస్ లు మహాభారత సమయంలో కూడ ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. పూర్వకాలంలో దక్షిణ భారతం అంతా అంటు వ్యాధులకు ఒక కేంద్రంగా ఉండేది అన్న విషయాలు ఆనాటి కాల బ్రిటీష్ అధికారి పరిశోధకుడు విలియం క్రూక్ రాసిన ‘ఫోక్ లోర్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో కూడ వైరస్ ల ప్రస్తావన కనిపిస్తుంది. అగ్ర రాజ్యాలతో సమానంగా వైజ్ఞానికంగా ఎదుగుతున్న ఇండియా ఆర్ధిక వ్యవస్థను కరోనా దెబ్బ తీస్తుంది అని సందేహాలు వస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం అలుపుఎరగని పోరాటం చేస్తున్న భారత ప్రజల స్పూర్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘WHO’ గుర్తించడం ఒక విధంగా ప్రతి భారతీయుడు గర్వించ తగ్గ సంఘటన. అదే స్పూర్తితో రానున్నరోజులలో కరోనా ను ధృఢ సంకల్పంతో తరిమికోడదాము అన్న భావన కలగచేసేలా ఈరోజు ప్రతి ఇంటిలో వెలిగే దీపజ్యోతుల కాంతులు కరోనా వ్యాధి నివారణకు భారత జాతి విజయం సాధించేలా కాంతి కిరణాలను ప్రసరించాలని అందరం కోరుకుందాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: