దేశంలో గత నెల 24 నుంచి కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఈ నెల 14 వరకు లాక్ డౌన్ సమయాన్ని కేటాయించారు.  అయితే దేశంలో కరోనా మాత్రం ఎక్కడా కట్టడి కాలేదు.. దాంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ మరో రెండు వారాలు పెంచితేనే బాగుంటుందని అంటున్నారు.  ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు మోదీకి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరారు.

 

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో లాక్ డౌన్ చాలా ఉపయోగపడిందని చెప్పారు. కరోనాపై యుద్ధంలో భారత్ గెలుస్తుందని అన్నారు.  లాక్ డౌన్ సంమయంలో రైతులు నష్టపోకుండా చూడాలని, ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని కేసీఆర్ కోరారు.

 

వచ్చే ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని విన్నవించారు.  రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని కోరారు. చెల్లింపులను 6 వారాలు వాయిదా వేయాలని విన్నవించారు.  వ్యవసాయ రంగాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చెప్పారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: