క‌రోనా వైర‌స్‌ను ఇప్ప‌టికే ప్ర‌పంచానికి అంటించిన డ్రాగ‌న్ కంట్రీ ఇప్పుడు మ‌రిన్ని ఘోరాతి ఘోర‌మైన ప‌నులు చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా ప్ర‌పంచ వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా చైనా క‌రోనా నుంచి కాస్త కోలుకోవ‌డంతో ఇత‌ర దేశాల‌కు సాయం చేశామ‌న్న బిల్డ‌ప్ ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే కొన్ని దేశాల‌కు నాసిర‌కం కోవిడ్ టెస్ట్ కిట్లు పంపుతోంది. తాజాగా మ‌న‌దేశాన్ని కూడా చైనా మోసం చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు ఆ దేశ చ‌ర్య‌లు చెప్ప‌క‌నే చెపుతున్నాయి. ఈ నెల 5న చైనా నుంచి భారత్‌కు వచ్చిన 1.7 లక్షల ‘పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్స్‌' (పీపీఈ కిట్లు)లలో దాదాపు 50,000 కిట్లు నాణ్యత రాహిత్యంగా ఉన్నాయి.

 

ఈ కిట్లు మ‌న‌దేశానికి వ‌చ్చిన వెంట‌నే గ్వాలియ‌ర్‌లో ఉన్న ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప‌రిశోధ‌నా కేంద్రంలో నాణ్య‌తా ప‌రీక్ష‌లు చేయ‌గా అందులో 50 వేల కిట్లు ప‌నికి రావ‌ని తేలింది. దీంతో ఈ కిట్ల‌ను ప‌డేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోగుల‌కు చికిత్స చేసే వైద్య శిబ్బందికి ఈ కిట్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ప్రైవేటు సంస్థ‌లు ఈ కిట్ల‌ను చైనా నుంచి కొని ఇస్తున్నాయి. పైగా చైనా మ‌న‌కు ఈ కిట్ల‌ను ఫ్రీగా ఏం ఇవ్వ‌లేదు. అయినా నాసిర‌కం కిట్ల‌ను పంప‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

నాణ్యత పరీక్షల్లో విఫలమైన కిట్లు ప్రైవేట్‌ కంపెనీలు విరాళంగా ఇచ్చినవని తెలిపారు. అయితే ఏ కంపెనీలు వాటిని విరాళంగా ఇచ్చాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 30,000 కిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నామని అధికారులు వెల్లడించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: