అందరూ ఎక్కువగా యూజ్ చేసే డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పేటీఎం. అయితే ఈ పేటీఎం తాజాగా ఒక అదిరిపోయే అక్షయ తృతీయ ఆఫర్ ని తీసుకువచ్చింది. అయితే ఇందులో భాగంగా బంగారు కొనుగోలు చేయాలనుకునేవారు ఇంటి వద్ద నుండే వారి బంగారు కొనుగోలు చేసుకోవచ్చు. దీనితోపాటు బంగారం కొనుగోలుపై మరో ఆకర్షణ ఆఫర్ ని కూడా ప్రకటించింది పేటీఎం. పేటీఎంలో కొన్న బంగారంపై ఏకంగా మూడు వేల వరకూ విలువైన బంగారాన్ని గెల్చుకొని ఛాన్స్ ని ప్రకటించింది సంస్థ. 

 


అయితే పేటీఎం తన గోల్డ్ బ్యాక్ ఆఫర్ కోసం MMTC తో జత కట్టింది. ఇందులో ఎంత అయినా బంగారం కొనుగోలు చేయవచ్చు ఎలాంటి పరిమితి అసలు ఉండదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి రానుంది, అయితే ఏప్రిల్ 26 దీనికి గడువు తేదీ. ఇందులో మినిమం ఒక రూపాయి నుంచి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే లాక్ డౌన్ కాలంలో ప్రజలు తమ ప్లాట్ ఫామ్ ద్వారా 90 కేజీల బంగారాన్ని కొనుగోలు చేశారని పేటీఎం తెలిపింది. అయితే పేటీఎమ్ ద్వారా కేవలం 24 క్యారెట్ల బంగారం మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఆ బంగారం వారి వారికి సంబంధించిన అకౌంట్లలో జమ చేయబడుతుంది. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని డెలివరీ తీసుకోవచ్చు. దీనితో ఆన్ లైన్ డెలివరీ సేవలు లాక్ డౌన్ పూర్తయిన తర్వాతనే అందుబాటులోకి రానున్నాయి.

 


ఇది అక్షయ తృతీయ అనేది హిందువులకు ఒక కీలకమైన పండుగ అని చెప్పవచ్చు. ఈ పండుగకు చాలా మంది ఒక నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో బంగారు షాపులన్నీ బందు కావడంతో బంగారం కొనుగోలు చేయలేని వారు పేటీఎమ్ ద్వారా ఆన్లైన్లో బంగారాన్ని కొనవచ్చు. పేటీఎం నుండి బంగారు కొనడం ఒక సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావించవచ్చని పేటీఎం అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: