ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా  విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ సంఖ్య కు సంబంధించి కంపారిజన్ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మొదట అతి తక్కువగా నమోదైన కేసులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా పెరిగి పోయాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కరోనా  వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి. దీనికి కారణం కేసీఆర్ సర్కార్ ఎంతో నిబద్ధతతో... కరోనా  వైరస్ పోరాటానికి  రాష్ట్ర ప్రజలందరికీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుండడం. 

 

 ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఉంటే.. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దాన్ని ఆచరణలో విజయవంతంగా పెడుతున్నారు. మహామారి కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. అయితే రాష్ట్రంలో నమోదైన 50 శాతానికి పైగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు పాతబస్తీ నుండి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పాతబస్తీ పై ఎక్కువగా దృష్టి పెట్టిన కేసీఆర్  గారు అక్కడ మరింత కఠిన నిబంధనలను అమలు చేసింది. అయితే ఒకప్పుడు టూ వీలర్ తో ఎదేచ్చయా  పాతబస్తీలో తిరిగిన ముస్లిం సోదరులందరూ ప్రస్తుతం కేవలం ఇళ్లకు  మాత్రమే పరిమితం అయ్యేలా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. 

 

 ముఖ్యంగా రోడ్ లను భారీ ఖేడ్ లతో మూసివేయడమే కాదు చిన్న చిన్న గల్లీలు, సందులు  కూడా బ్లాక్ చేసింది తెలంగాణ సర్కార్. బ్లాక్ చేయడం అంటే ఏదో ఒకటి కలిసి దాని పక్కకు నెట్టి వీలు ఉండేలా కాదు... ఎంత ట్రై చేసిన పక్కకు జరపకుండా పూర్తిగా బ్లాక్ అయ్యే విధంగా పాతబస్తీలోని చిన్న చిన్న సందులు  సైతం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ చాలామంది ముస్లిం సోదరులు బయటకు రాకుండా ఇంట్లోనే కే పరిమితమయ్యారు. అటు  ముస్లిం సోదరులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కట్టడి విజయవంతంగా అవుతుండడంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: