లాక్ డౌన్ సడలింపులు రావడంతో ఏపీ ప్రభుత్వం తాజాగా మద్యం షాపులు ఓపెన్ చేసింది. దీంతో ఇన్నిరోజులు మద్యం దొరకక గిలగిలా కొట్టుకున్న మందుబాబులు, ఒక్కసారిగా వైన్ షాపులు దగ్గర ఎగబడిపోయారు. అయితే ఇలా సడన్ గా మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్..లాక్ డౌన్ ని అవకాశం తీసుకుని మొత్తం క్లోజ్ చేయొచ్చుగా అని అడుగుతున్నారు. ఇలాంటి టైంలో మద్యం షాపులు ఓపెన్ చేస్తే పేద ప్రజలు నానా కష్టాలు పడతారని అంటున్నారు. అలాగే వైన్ షాపులు దగ్గర సామాజిక దూరం కూడా పాటించడం లేదని విమర్శిస్తున్నారు.  కేంద్రం ఆదేశాల మేరకే మద్యం షాపులని ఓపెన్ చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 

అయితే ఇక్కడ టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఓ వైపు మద్యం షాపులని ఎందుకు తెరిచారని ప్రశ్నిస్తూనే మరోవైపు మందుబాబుల కోసం పోరాటం చేస్తుంది. అసలు మద్యాన్ని 75 శాతం ఎందుకు పెంచారని. పైగా కొత్త కొత్త బ్రాండ్లని తీసుకొచ్చి మందుబాబుల ఆరోగ్యం చెడగొడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ నేతల చేసే విమర్శలకు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలు పెంచి, షాపులని ప్రభుత్వం నడుపుతోందని, తమ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అదే జరుగుతుందని చెబుతున్నారు.

 

ఇప్పుడు కూడా మద్యం రేట్లు ఎక్కువ పెంచితే మద్యం కొనకుండా ఉంటారని అంటున్నారు. అయితే రేట్లు పెంచిన మందుబాబులు ఆగరని, ఎక్కడైనా ధరలు పెంచారని చెప్పి మందు కొనడం ఆగిందా అని కొందరు విశ్లేషుకులు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయం దారుణంగా పడిపోయింది కాబట్టి, మద్యం ధరలు పెంచారని, దీనికి మించి వేరే మార్గం లేదని అంటున్నారు. కానీ ఈ టైంలో పేదలు మాత్రం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారని, పనులు సరిగా లేకపోయినా ఏదొకవిధంగా డబ్బులు తెచ్చేసి, మందు కొనుక్కొని తాగుతున్నారని, దాని వల్ల వారి కుటుంబం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: