మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్ డౌన్ కొనసాగించిన  విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దుకాణ సముదాయాల మద్యం  దుకాణాలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

 

 అంతే కాకుండా తాజాగా రోడ్డు రవాణా వ్యవస్థను కూడా పునః  ప్రారంభించిన విషయం తెలిసిందే.దీంతో మొన్నటి వరకు కేవలం డిపో లకు  మాత్రమే పరిమితమైన ఆర్టీసి బస్సులు ప్రస్తుతం రోడ్డెక్కి రయ్యి రయ్యి మంటూ తిరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి దృశ్య  అంతకుముందు ఆర్టీసీ బస్సులో ఉన్న సీటింగ్ విధానాన్ని తొలగించి ప్రతి ప్రయాణికుడికి సామాజిక దూరం ఉండే విధంగా సరికొత్త సీటింగ్  విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి బస్సులోని ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ బస్సులో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం బాగానే కనిపిస్తోంది

 


 ప్రతి లైన్ లో రెండు సీట్లు ఉండగా కేవలం ఆ రెండు సీట్లు కలిపి ఒకే ప్రయాణికుడిని మాత్రమే కూర్చోబెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో బస్సులో ఉన్న మూడు లైన్లలో ప్రతి ప్రయాణికుడుకి  సామాజిక దూరం కనిపిస్తోంది. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఉండడం కూడా ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఫోటో చూస్తుంటే ఓవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా  బస్సులో ప్రయాణించే ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: