కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకొని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. బేలూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తలపై ఓ పెద్ద పనస పండు పడింది. దాంతో అతని మెడకు, వెన్నుముక కు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చెట్టుపైనుండి పనసపండు కోస్తుండగా ఒక పెద్ద పనసపండు తన తల పై పడడంతో తాను చెట్టునుండి కిందపడి వెన్నుముక కి, తలకు, కాళ్ళకి బలమైన దెబ్బలు తగిలిచుకున్నాడు.


దాంతో వైద్యులు తన పరిస్థితి విషమంగా ఉందని సర్జరీ చేయాలని చెప్పారు. అయితే తమ ఆసుపత్రి మార్గదర్శకాల ప్రకారం సర్జరీ చేసే ప్రతి ఒక్కరికి ముందస్తుగానే కోవిడ్ 19 టెస్ట్ ని నిర్వహిస్తారు. ఆటో డ్రైవర్ కి కూడా కరోనా టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు డాక్టర్లు వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వాళ్ళు కూడా ఆశ్చర్య పోతూ అతని తలపై పనస పండు పడితే కరోనా ఎలా వస్తుంది అని అవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 


పరియారామ్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే సుదీప్ ఆటోడ్రైవర్ కి కోవిడ్ 19 ఉందని వెల్లడించాడు. ఆటో డ్రైవర్ కి కోవిడ్ 19 వ్యాధి లక్షణాలు ఉన్నాయి కానీ అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ గానీ కరోనా పీడితులతో కాంటాక్ట్ లో ఉన్నట్టుగానీ సమాచారం లేదు. తన ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ద్వారా ఇతనికి covid-19 వ్యాధి సోకి ఉండవచ్చు. తను ఒకసారి జిల్లా ఆసుపత్రికి వెళ్లాడని తెలిసింది. బహుశా అక్కడ నుండి కూడా సంక్రమించి ఉండవచ్చును. ఏది ఏమైనా ప్రస్తుతం పాటించవలసిన జాగ్రత్తలను మేము పాటిస్తున్నాము అని డాక్టర్ కె సుదీప్ చెప్పాడు. 


ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు అక్కడి అధికారులు. గతంలో కూడా కేరళ లో చాలామందికి ఎటువంటి ఆనవాలు లేకుండా కోవిడ్ 19 సోకింది. అదృష్టవశాత్తూ వాళ్ళందరూ కొద్ది రోజుల్లోనే వ్యాధి నుండి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వారి నుండి ఇతరులకు కరోనా వైరస్ సంక్రమించకుండా పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: